ఎస్ జానకి మరణం : తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో దిగ్గజం కోల్పోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ , ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించిన ప్రముఖ సింగర్ ఎస్ జానకి కాసేపటి క్రితమే కన్ను మూసారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన జానకిని మైసూరు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తుది శ్వాసని విడిచారు. డాక్టర్లు ఆమె ప్రాణాలను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు కానీ , విఫలం అయ్యారు. ఈ విషయాన్నీ స్వయంగా జానకి మనవరాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ పరిశీలనతెలుసుకున్న కోట్లాది మంది తెలుగు ప్రజలు శోకసంద్రం లో మునిగిపోయారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల భాధ అయితే వర్ణనీతం. ఆమె లేని లోటు ఎవ్వరూ పూడవలేనిది.
ఎస్ జానకి వయస్సు అక్షరాల 88 సంవత్సరాలు. ఈమె 1938 వ సంవత్సరం లో రేపల్లె లో జన్మించారు. ఈమె భర్త పేరు రామప్రసాద్. ఈయన 1997 వ సంవత్సరం లోనే చనిపోయారు. ఈ దంపతులకీ మురళి కృష్ణ అనే ఏకైక కుమారుడు మాత్రమే. సినిమాలకు దూరమయ్యాక జానకి తన శేష జీవితాన్ని తన కొడుకు తోనే గడుపుతూ వచ్చింది. ఈమె కెరీర్ 1957వ సంవత్సరం విడుదలైన ‘విధియిన్ విలయత్తు’ అనే తమిళ సినిమాతో మొదలైంది. ఆ తర్వాత వరుసగా ఈమెకు అవకాశాలు వచ్చాయి. తెలుగు , తమిళం , హిందీ , మలయాళం, కన్నడ, ఒడిశా , బెంగాలీ అని తేడా లేదు , ప్రతీ భాషలోనూ ఈమె తన గాత్రాన్ని అందించింది. అభిమానులు ఈమెని ప్రేమతో ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ అని పిలుచుకుంటూ ఉంటారు. 60 ఏళ్ళ తన సుదీర్ఘ సినీ ప్రస్థానాన్ని అక్టోబర్ 28, 2017 వ సంవత్సరం లో మైసూరు లో ఏర్పాటు చేసారు ఒక మ్యూజిక్ కన్సర్ట్ తో ముగించారు.
సినీ పరిశ్రమకు ఈమె అందించిన అద్భుతమైన సేవలకు గానూ , పద్మ భూషణ్ , నేషనల్ అవార్డు, కేరళ స్టేట్ అవార్డు బెస్ట్ సింగర్ , నంది అవార్డు, ఫిలిం ఫేర్ లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డులు వచ్చాయి. ఈ స్థాయిలో అవార్డులు అందుకున్న సింగర్ దేశంలోనే ఎవ్వరూ లేరనే చెప్పాలి. తన కెరీర్ మొత్తం మీద ఈమె అన్ని భాషలకు కలిపి 48 వేల సాంగ్స్ పాడారు. రోజున ఆమెతో సంగీత దర్శకులు 28 పాటలు రికార్డు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈమె తెలుగులో చివరిసారిగా పాడిన పాట ‘అందాల రాశివో’. 2018 వ సంవత్సరం లో నితిన్ హీరోగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం లోనిది ఈ పాట . అధికారికంగా 2017 వ సంవత్సరం లో రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ , ఆమె చేత కొంతమంది డైరెక్టర్లు స్పెషల్ రిక్వెస్ట్ తో పాటలు పాడుకునేవారు. అలాంటి దిగ్గజం నేలరాలడం తెలుగు సినిమా దురదృష్టం అంటే చెప్పాలి.

