Kavya Maran: హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మైదానంలో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఐపీఎల్ లో కావ్య జట్టు ప్లే ఆఫ్ అయిపోయింది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ.. టాప్ 2 స్థానంలోకి వెళ్లలేకపోయింది. నెట్ రన్ రేట్ అధికంగా సాధించడానికి బెంగళూరు జట్టుకు 150 పరుగుల లోపు కట్టడి ఉండగా.. హైదరాబాద్ జట్టుకు అది సాధ్యం కాలేదు. కాకపోతే ఈ మ్యాచ్‌లో ఘనమైన విజయాన్ని అందుకుంది.
బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డికి క్రునాల్ పాండ్యా అత్యంత వేగవంతమైన బంతి వేశాడు. పైగా ఆ బంతిని కూడా బౌన్సర్ గా వేశాడు. ఒక ఫాస్ట్ బౌలర్ ఏ విధంగా అయితే వేస్తాడో.. అంతకుమించిన వేగంతో వేశాడు. అయితే ఆ బంతి వైడ్ వెళ్ళింది. దీంతో మ్యాచ్ చూస్తున్న కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తన పక్కనే ఉన్న విక్టరీ వెంకటేష్ తో సంభాషించింది.
దీనికి సంబంధించిన వీడియోను హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు. కావ్య తన జట్టును ఎదుర్కొంటూనే బంతులను కూడా అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నారని.. తన పక్కనున్న వారితో ఆ బంతుల గురించి చర్చిస్తారని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కాగా కావ్య బంతి గురించి వెంకటేష్ తో చర్చించారని.. బంతి అలా వస్తుందని ఎందుకని ప్రశ్నిస్తే.. ఇలాంటివన్నీ జరిగిపోతూనే ఉంటాయని వెంకటేష్ అక్కడి దృశ్యాలను చూస్తే.
హీరో వెంకటేష్ క్రికెట్ విపరీతంగా చూస్తారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో కచ్చితంగా ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లకు హాజరవుతారు. ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు వెంకటేష్ హాజరవుతున్నారు. ఆయన హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేస్తున్నారు.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తున్నాయి. క్రికెట్ మీద ఉన్న అభిమానంతో వెంకటేష్ తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్‌కు కావ్య మారన్ స్పందన పూర్తిగా గోల్డ్‌గా ఉంది
ఆమె ఒక సెకను చాలా గందరగోళంగా కనిపించింది,
“భాయ్ యే బాల్ దాల్ రహా హై యా ఎక్స్పెరిమెంట్ కర్ రహా హై?” pic.twitter.com/hK7cf9FOSa— రుతురాజ్ అకాడమీ (@Ruturaj_Academy) మే 23, 2026

