మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటీ కాకుండా జరిగిన సమావేశం సువర్ణ అధ్యాయం ఎలా ఉంటుందని, సిఎం రేవంత్ రెడ్డి, గురువారం ఓ ప్రకటనలో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణను గాలికి వదిలేసి ప్రచారం పేరుతో చేసిన డ్రామా తెలంగాణకు నిష్ప్రయోజనమన్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు పక్కనపెట్టి కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ నీటి వాటా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై రేవంత్ రెడ్డి ఏదైనా స్పష్టమైన హామీ సాధించారా?, ఆంధ్రా వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించారా? అని నిలదీశారు. ఈ జరగకపోవడం వల్లే ఆర్డీఎస్ కింద తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా
ప్రతిసారీ కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన రాష్ట్రానికి రావాల్సిన 15.90 టిఎంసిల నీరు ఎలా వస్తుందో రేవంత్ రెడ్డి చెప్పాలని, గత 75 ఏళ్లుగా పాత గేట్లు పనిచేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడానికి, తెలంగాణకు దక్కాల్సిన 15.90 టిఎంసిల నీటి వాటాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ కీలకమైన విషయంపై సిఎం సాధించిన హామీ ఏమిటని నిలదీశారు. ‘సిస్టమ్ లాసెస్’ అనే వాదనను రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించారని, కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ అవార్డులో ఈ ‘సిస్టమ్ లాసెస్’ అనే విధానానికి అసలు గుర్తింపే సహాయం. ట్రైబ్యునల్ అవార్డు లేని ఈ వాదనను అడ్డుపెట్టుకుని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను తగ్గించడానికి వీల్లేదని చెప్పారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ పరిమితికి మించి వాడుకుంటున్న తీరును రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని, కెసి కెనాల్ కోసం సుంకేసుల వద్ద ఆంధ్రా ప్రభుత్వం ఏకంగా 39 టిఎంసిల నీటిని వాడుకుంటోందని, కర్ణాటకతో కుమ్మక్కై కెసి కెనాల్‌కు వెళ్లాల్సిన దాదాపు 10 టిఎంసిల నది జలాలను ఆర్బిఎల్సిలకు మళ్లిస్తోందన్నారు.

