AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఊహించని ఉపద్రవం వచ్చింది. అది ఇప్పుడు ప్రారంభంలోనే ఉంది. ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో ఏది ఉండదు. ఏది ముందుకు కొనసాగదు.
ఐటి వ్యవస్థ ఏఐ వల్ల ఎంతటి మార్పులకు గురైందో.. అంతకు మించిన ఒత్తిడి ఎదురైంది. ఈ ఒత్తిడి వల్ల చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. ఖాళీగా రోడ్లమీద తిరుగుతున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. కొత్త ఉద్యోగాలు దొరకడం లేదు. ఉన్న ఉద్యోగాలు పోయాయి. కొందరు కార్లు నడుపుతున్నారు. మరికొందరేమో హోటల్స్ పెట్టుకున్నారు. ఇంకొందరేమో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు.. ఐటి పరిశ్రమను మాత్రమే కాదు, ఏకంగా మూలనపడేలా ఏఐ దెబ్బతీస్తోంది. ఏఐ దెబ్బ వల్ల సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు కాకుండా.. డిగ్రీలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
సాధారణ దశను ఇప్పటి కాలం పిల్లలు ఇష్టపడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 929 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో మొత్తంగా 4.37 లక్షల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది కేవలం 1.4 లక్షల మంది మాత్రమే డిగ్రీలో జాయిన్ అయ్యారు. దాదాపు 70 శాతం కాలేజీలలో చేరికలు లేవు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కాలేజీలలో కనీసం 15% సీట్లు కూడా భర్తీ కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
మొదటి దశలోనే సీట్లు భర్తీ కాలేదు. ఏఐ వల్ల ఎడ్యకేషన్ సిస్టం కూడా నాశనం అవుతుందని.. మూలాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటున్న విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి ప్రారంభంలోనే అడ్డుకట్ట వేయాలని.. లేకపోతే భవిష్యత్తు కాలంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పటి మాదిరిగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లభించడం లేదు. పైగా ఐటీ పరిశ్రమలో సాధారణ డిగ్రీలు చేసిన వారికి ఉపాధి దొరకడం లేదు. ఇలాంటి సమయంలో ఆ విద్యార్థులు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్లిపోతున్నారు. అందులో ఉన్న రకరకాల టూల్స్ నేర్చుకొని ఉపాధి పొందవచ్చని అనుకుంటున్నారు. అయితే డిగ్రీ చేస్తే వెంటనే ఉపాధి లభిస్తుందని ప్రభుత్వాలు కల్పించడం లేదు. అందువల్లే విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఎదురుకాని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.

