Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. టెక్నాలజీ వినియోగంలో కొత్త కొత్త ప్రయోగాలు జరిగినప్పటికీ.. ఈ స్థాయిలో మాత్రం మార్పులు చోటు చేసుకునేవి కావు.
ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ వచ్చి ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిందో టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. మనిషి జీవితాన్ని అత్యంత సుఖవంతం చేస్తున్నాయి. మనిషితో అవసరం లేకుండానే పనులు జరుగుతున్నాయి. టెక్నాలజీ వినియోగం పెరగడంతో ఐటీ కంపెనీలు కూడా.. మనుషులతో టెక్నాలజీతోనే ఎక్కువ శాతం పనులు జరుగుతున్నాయి.
ఐటి గుర్తింపు పొందిన కంపెనీలు ఒకప్పుడు మనుషులతో మాత్రమే పనులు చేయించేవి. ఇప్పుడు ఆ కంపెనీలు కూడా టెక్నాలజీని విపరీతంగా వాడుకోవడం మొదలుపెట్టాయి. మనుషుల కంటే ముఖ్యంగా టెక్నాలజీ ద్వారానే ప్రాజెక్టులు.. ఇతర వ్యవహారాలు సాగుతున్నాయి. టెక్నాలజీతో విపరీతంగా ప్రయోగాలు చేసే కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి. ఇది మన దేశంలో ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఇది ఒకటి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఐటి ఇండస్ట్రీని షేక్ చేసే విధంగా ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ప్రజలను నియమించుకుంటామని ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇప్పటికే నాలుగు వేల మందిని ఇన్ఫోసిస్ నియమించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఉత్పత్తి పెరిగి.. మెరుగైన ఫలితాలు వస్తున్నప్పటికీ.. హైరింగ్ కొనసాగుతోంది అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ ఏడాది క్వార్టర్లో 48,211 కోట్ల తొలిలో ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది. ఇందులో 7,769 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ఇన్ఫోసిస్ ఇలా చేయడం పట్ల ఐటీ ఇండస్ట్రీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిజానికి ఏఐఐ దుమ్ము రేపుతున్న వేళ పెద్ద పెద్ద కంపెనీలు కూడా రిక్రూట్మెంట్లు జరపటం లేదు. పైగా ఉన్నవాళ్లను తొలగిస్తున్నాయి. కేవలం టెక్నాలజీ ద్వారా మాత్రమే ప్రాజెక్టులు ఇతర వ్యవహారాలు సాగిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ కంపెనీలకు ఇన్ఫోసిస్ ఒక రకంగా షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తు కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే మనుషులు చేసే ప్రాజెక్టులే నమ్మకంగా ఉంటాయని నివేదికలు వస్తున్నాయి. పైగా ప్రెషర్లు అద్భుతంగా పనిచేస్తారు. తక్కువ వేతనం కూడా ఇవ్వచ్చు. అందువల్ల ఇన్ఫోసిస్ ఈ పని చేసిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

