ఆంధ్రప్రదేశ్:నైరుతి రుతుపవనాలు క్రమంగా ఏపీలోకి విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ(వాతావరణ శాస్త్ర విభాగం) ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం…నేడు ప్రకాశం జిల్లా మార్కాపురం,కర్నూలు,నంద్యాల, అనంతపురం,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం.అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం ప్రాంతాలు,పోలవరం పరిసరాలు,అనకాపల్లి జిల్లా మరియు రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్లు కింద నిలబడకూడదని,అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.

