ఏపీలో విటమిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాల్లో లక్షణాలతో నలుగురు మృతి చెందడం… పేకిటివ్ కేసులు 16కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కూటమి సర్కార్. విజయవాడ జీజీహెచ్‌లో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.15 బెడ్లతో ఐసీయూ ఏర్పాటు చేశారు అధికారులు.
కోవిడ్ కిట్లు, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచామని.. 10 మంది వైద్యుల బృందం, సిబ్బందిని అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జీజీహెచ్ నుంచి ఇప్పటివరకూ 46 శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించామని… 46 మందిలో ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రాలేదని అధికారులు గుర్తించారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కోవిడ్ మెడిసిన్ అందుబాటులో ఉంచామని… జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలతో ఎవరొచ్చినా రెగ్యులర్ ఓపీ కాకుండా కోవిడ్ వార్డుకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇక్కడే ప్రత్యేకంగా కోవిడ్ కోసం ఓపీ ఏర్పాటు చేశామని…ఏ సమయంలోనైనా ఓపీ సేవలు అందజేస్తామని కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

