అన్నామలై రాజ్యసభ వార్తలు: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఈ క్షణంలోనైనా రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.. జూన్‌లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్నారు. వారి స్థానంలో వారి కొత్త ఎంపిక కోసం ఎలక్షన్ కమీషన్ ఏర్పాట్లు మొదలు పెట్టింది. అయితే ఈసారి ఏపీ నుంచి బిజెపికి ఒక రాజ్యసభ పదవి వచ్చే అవకాశం ఉంది. గతంలోనే ఆ అవకాశం రాగా కృష్ణయ్య ద్వారా ఆ పదవిని భర్తీచేసింది బిజెపి. అయితే ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఇతర రాష్ట్రానికి చెందిన నేతకు ఏపీ నుంచి బిజెపి రాజ్యసభకు పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో.. మూడింటిని టిడిపి ఉంచుకోనుందట. మిగిలిన ఒక్క పదవిని బిజెపికి కానీ.. జనసేనకు కానీ విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే బిజెపి మరోసారి ఏపీ నుంచి కోరుకునే ఛాన్స్ ప్రారంభమైంది.
ఆశావహులు అధికం..
అయితే ఏపీ బీజేపీలో చాలామంది ఈ పదవి కోసం ఉన్నారు. ప్రధానంగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ రేసులో ఉన్నారు. కానీ ఈ పదవిని తమిళనాడుకు చెందిన అన్నామలై బిజెపి హై కమాండ్ ఆఫర్‌కు అందిస్తుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నమలై పోటీ చేయలేదు. ఆయన ఎన్నికల వ్యూహానికి పరిమితం అయ్యారు. కానీ తమిళనాడులో బిజెపి ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యంలో అన్నామలై ఛాన్స్ ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలు వినిపించాయి.
అన్నామలైకు ఛాన్స్..
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడు నుంచి అన్నామలైకు రాజ్యసభకు ఛాన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో సనాతన ధర్మం గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు అన్నమలై. అక్కడ ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. అందుకే అన్నామలైకు రాజ్యసభ అవకాశమిచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నది కేంద్ర పెద్దల ఆలోచనగా ఉంది. తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశంలో బిజెపి హిందుత్వ వాదాన్ని తీసుకెళ్లాలన్నది ప్రణాళికగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో..

