టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇంకే నిర్మాత గురించి సామిజిక మాధ్యమల్లో అంత చర్చ జరగదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరి మీదైనా పంచ్ వేయడానికి అస్సలు వెనుకాడని నాగవంశీ.. ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌కు ధీటుగా సమాధానం చెప్పడం ద్వారా బాలీవుడ్ ప్రముఖులు, మీడియా ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడం గుర్తుండే ఉంటుంది.
అయినా కూడా అతనేమీ చలించలేదు. అలాంటి వ్యక్తి.. తనను ఉద్దేశించి ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన సైలెంటుగా ఉండడం చర్చనీయాంశమైంది. ఇటీవల సింగిల్ స్క్రీన్‌లో పర్సంటేజీ పద్ధతిని అమలు చేసే విషయమై ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య తకరారు నడిచిన స’మయంలో సునీల్ నారంగ్‌ను ఉద్దేశించి నాగవంశీ ఏదో అంటే.. దానికి బదులుగా నాగవంశీ వ్యాఖ్యలు చేయడం లేదు. విమర్శలకు దారి తీసింది.
దీని గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగితే నాగవంశీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మిమ్మల్ని అలా టార్గెట్ చేసినా సైలెంటుగా ఉండిపోయారేంటి, అది మీ స్వభావం కాదు కదా అని అడిగితే.. తాను వెంట నే ఒక్క మాట అని ఆ వ్యక్తి కుటుంబాన్ని బాధ పెట్టడం ఎందుకు అని ఆగిపోయినట్లు నాగవంశీ తెలిపాడు. అలా అని తాను పూర్తిగా సైలెంటుగా ఉండే రకం కాదని.. దానికి రివెంజ్ ఉంటుందని నాగవంశీ హింట్ ఇచ్చాడు.
నారంగ్ పేరెత్తకుండా ఆయన్కు బాగా డబ్బులున్నాయ’ని.. ఆయన్ను మ’నమేమీ చేయలేమ’ని.. కానీ తన దగ్గర కంటెంట్ ఉందనీ.. ఆ కంటెంట్‌తో ఏం చేయాలో అది చేస్తామనీ.. తిరిగి దెబ్బ కొడతామ’ని నాగవంశీ నర్మగర్భ వ్యాఖ్య చేశారు. ఐతే నైజాం ఏరియాలో అత్యధిక థియేటర్లు ఉన్న సునీల్ నారంగ్‌ను కంటెంట్‌తో దెబ్బ కొట్టడం అంటే నాగవంశీ ప్లానేమిటో మరి?

