divorce case reunited : విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరిగారు. ఐదు సంవత్సరాలపాటు విడాకుల కోసం పోరాడారు.పెద్దలు.. కోర్టులో న్యాయాధికారులు ఎన్ని రకాలుగా చెప్పారు. మరి కొద్ది రోజుల్లో విడాకులు అవుతాయనుకుంటున్న అనూహ్యమైన సంఘటన జరిగింది.
ఢిల్లీ నగరానికి చెందిన సౌరబ్ అనే వ్యక్తికి 2020లో శిఖ అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజుల వరకు వారిద్దరు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. మొదట్లో చిన్నపాటి గొడవ.. ఆ తర్వాత మరింత పెరిగింది. దీంతో ఇద్దరూ విడిగా ఉండాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.. విడివిడిగా ఉండటం మొదలుపెట్టారు. పరస్పరం కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా విడాకుల కోసం ఫ్యామిలీ కోటు చుట్టూ తిరుగుతున్నారు..
న్యాయవాదుల ఫీజులు.. ఇతర ఫీజులకు సంబంధించిన ఖర్చులు వంటి వాటి వల్ల రెండు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఇటీవల ఈ బాధతో శిఖ తండ్రి గుండెపోటుతో. ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించే స్థాయి లేకుండా పోయింది. అతడిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న సౌరబ్..శిఖ తండ్రిని గురుగ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించాడు. మెరుగైన వైద్యం అందించడానికి తనవంతుగా సహకరించాడు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
ఇటీవల విడాకుల కేసు విచారణకు సంబంధించి సౌరబ్..శిఖ కోర్టుకు నిందితుడు. వారిద్దరి తరపున న్యాయవాదులు వాదనను వినిపించడం ప్రారంభించారు.. కేసు తుది విచారణలో భాగంగా విడాకులు తీసుకుంటారా అని అడిగారు. వెంటనే శిఖ సినిమా స్టైల్ లో తన చేతిలో ఉన్న విడాకుల పత్రాలను చించేసింది. తన భర్తతో విడాకులు తీసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కలిసి ఉంటామని వివరించింది. మొత్తంగా ఐదు సంవత్సరాలపాటు విడాకులు తీసుకుంటామని అనుకున్న వారిద్దరు.. ఐదు నిమిషాల్లో కలిసిపోయారు. సినిమా స్టోరీని కళ్ళ ముందు ఉంచారు. నేటి కాలంలో చిన్న చిన్న ఘటనలకే గొడవ పడుతున్న వారికి ఈ దంపతులు ఆదర్శంగా నిలిచారు.
నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది
> విస్తృతంగా పంచుకున్న ఖాతాల ప్రకారం, శిఖా సింగ్ తన భర్త సౌరభ్‌పై వరకట్నం కేసు పెట్టింది మరియు ఆ జంట కొన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు.
> సుదీర్ఘ విచారణ సమయంలో, శిఖా తండ్రి తనలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు… pic.twitter.com/TK2jebIX1V
– శ్రీసత్య (@sathyashrii) జూన్ 12, 2026
image.png

