IPL 2026 ఫైనల్ ప్రైజ్ మనీ: ఐపీఎల్ చివరి దశకు చేరింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్లు పోటీ పడబోతున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్ బెంగళూరులో గుజరాత్ జట్టును ఓడించింది. ఇటీవల రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్ లాగా వచ్చేసింది.. రెండు జట్లలో హేమాహేమీలైన ఆటగాళ్లు మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం వచ్చింది.
ఐపీఎల్లో సాధారణంగా కాసుల ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి మ్యాచ్ కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఫైనల్ పోరులో విజయం సాధించిన జట్టుకు ఏ స్థాయిలో ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం అభిమానుల్లో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఐపీఎల్లో ఛాంపియన్‌గా ఆవిర్భవించిన జట్టుకు 20 కోట్లు లభించాయి. రెండవ స్థానంలో మించిన జట్టుకు 13 కోట్లు లభించాయి. మూడో స్థానంలో రాజస్థాన్ జట్టు నిలిచింది కాబట్టి.. ఏడు కోట్లు వస్తాయి.. నాలుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ జట్టుకు 6.5 కోట్లు లభిస్తున్నాయి. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు 10 లక్షల చొప్పున లభిస్తున్నాయి. అత్యంత విలువైన ఆటగాడికి 10 నుంచి 15 లక్షల వరకు లభిస్తాయి. ఎమర్జింగ్ ప్లేయర్‌కు 20 లక్షల వరకు దక్కుతాయి. సూపర్ స్ట్రైకర్, అత్యధిక సిక్సర్లు కొట్టిన అధికారులకు చెరి 10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభిస్తుంది.
ఐపీఎల్ లో ఈ స్థాయిలో ప్రైజ్ మనీ చెల్లించడం వెనుక ప్రధాన కారణం.. క్రీడా స్ఫూర్తిని పెంచడమే. ఐపీఎల్ బ్రాండ్ వేల్యూ పెరగడం వల్ల బిసిసిఐ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. టి20 లీగ్‌లలో ఏ యాజమాన్యం కూడా ఈ స్థాయిలో ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు. కాకపోతే ఐపిఎల్ మార్కెట్ విలువ వేరే విధంగా ఉంటుంది. ప్రసార హక్కుల రూపంలో భారీగా వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ స్థాయిలో ప్రైజ్ మనీ..కు సొమ్ములు చెల్లిస్తోంది.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన జట్టు విలువ కూడా విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది. 2008లో రాజస్థాన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. అప్పటినుంచి మరోసారి ఆ జట్టు ట్రోఫీ అందుకోలేకపోయింది. ఆయన అయినప్పటికీ ఇటీవల ఆ జట్టు చేతులు మారాయి. ప్రారంభంలో కొనుగోలు చేసిన యాజమాన్యానికి భారీగా డబ్బులు వచ్చాయి. బెంగళూరు గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. దీంతో ఆ జట్టు విలువ పెరిగింది. పాత యాజమాన్యం జట్టును అమ్మింది. భారీగా డబ్బులు రావడంతో పండగ చేసుకుంది. ఐపీఎల్ ప్రారంభంలో జట్లను కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఇప్పటికే లాభాలు సంపాదించాయి. ఒకవేళ ఆ జట్లను కనుక అమ్ముకుంటే వాటికి భారీగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే కంపెనీలు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి.

