చైనీస్ బ్రాండ్ ఐటెల్ ఐఫోన్ 17 ప్రోను పోలిన ఒక స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ కొత్త మోడల్ ని ఐటెల్ A100 ప్రో పేరుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ గత సంవత్సరం వచ్చిన ఐటెల్ 100కి. ప్రీమియం లుక్, డిజైన్, రంగుల ఎంపికలతో బడ్జెట్ ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఐటెల్ A100 ప్రో ధర
ఈ ఫోన్ కేవలం ఒకే వేరియంట్లో అనగా 3GB RAM + 64GB స్టోరేజ్‌లో విడుదల అయింది. వర్చువల్ RAM ఉపయోగించి ఈ స్టోరేజ్‌ను 8GB వరకు విస్తరించుకోవచ్చు. కాగా, ఈ ఫోన్ ధర రూ.8,999. పరికరం కామెట్ ఆరెంజ్, బ్లాక్, క్లౌడ్ వైట్ అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. అదనంగా, 100 రోజుల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా లభిస్తుంది.
ఐటెల్ A100 ప్రో ఫీచర్లు
డిస్ప్లే: 90Hz రిఫ్రెష్ రేట్, వాటర్‌డ్రాప్ నాచ్‌తో కూడిన 6.6-ఇంటన్ HD+ IPS ప్యానెల్
ప్రాసెసర్: యూనిసోక్ T7100 చిప్సెట్
సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్
బ్యాటరీ: 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
: 8MP వెనుక కెమెరా + 5MP ముందు కెమెరా కెమెరా
సెక్యూరిటీ: సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ + ఫేస్ అన్‌లాక్
ఇతర ఫీచర్లు: IR బ్లాస్టర్, DTS స్పీకర్, మిలిటరీ-మన్నిక

