స్టార్ హీరోల సినిమాల గురించి ఐశ్వరీ రాజేష్ ఓపెన్: మూవీ కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారని హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ అన్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఓ సుకుమారి లాంచ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Obsession చూశారా?
‘విజయ్ సీఎం అయిపోయారు. అజిత్ గారు సినిమాలు చేయట్లేదు. తమిళ ఇండస్ట్రీలో భారీ కలెక్షన్స్ వచ్చే హీరోస్ లేరని అంటున్నారు. ఒప్పందం మీరేమంటారు?’ అన్న ప్రశ్నకు ఐశ్వర్య ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. స్టార్ హీరోస్ ఉన్నా లేకున్నా కంటెంట్ంటే ఆటోమేటిక్‌గా ఆడియన్స్ చూసేందుకు వస్తారని అన్నారు ఐశ్వర్య రాజేష్. ‘రీసెంట్గా సూర్య కరుప్పు బ్లాక్ బస్టర్ అయ్యింది. Obsession సినిమాలో నటినటులు ఎవరో మనకు తెలీదు.
కానీ 6 కోట్లతో మూవీ తీస్తే వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మనకు వారెవరో కూడా తెలీదు. అది హారర్ మూవీ కాదు. ఓ చిన్న సినిమా. మనల్ని థియేటర్లో కూర్చొబెట్టారు. సోషల్ మీడియాలో వేలాది కొద్ది రీల్స్ పుట్టుకొస్తున్నాయి. భాష, నటులు అవన్నీ పక్కన పెడితే కంటెంట్ బాగుంటే జనాలు కచ్చితంగా ఆదరిస్తారు. ఆ నమ్మకంతోనే ఇన్నేళ్లు సినిమాల్లో ఉన్నాం.’ అని అన్నారు.
Also Read : Suriya Face Swap: ప్రభాసే కాదు… సూర్య కూడా దొరికేశాడు… ఇద్దరి సినిమాల్లో సేమ్ మిస్టేక్
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై…
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే బాధ్యత ఎక్కువ… అందుకే కథ ఆధారంగా మూవీస్ సెలక్ట్ చేసుకుంటున్నట్లు చెప్పారు ఐశ్వర్య రాజేష్. ‘నేను ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేసి చాలా రోజులు అయిపోయింది. సంక్రాంతికి వస్తున్న తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. కథలు టైం తీసుకుని మంచి సినిమాలు నచ్చనేదే రీజన్. బ్లాక్ బస్టర్ తర్వాత రెండు సినిమాలు వచ్చే చోట 20 సినిమాలు వస్తాయి.
నా కెరీర్లో 8 ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేశాను. ఇలాంటి మూవీస్ చేసినప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఏదైనా రిలీజైన తర్వాత రిజల్ట్ తేడా వస్తే చాలా క్వశ్చన్స్ జనరేట్ అవుతాయి.’ అని అన్నారు.
‘మా నాన్నే గుర్తొస్తారు’
హీరో తిరువీర్‌ను చూస్తే తన తండ్రే గుర్తొస్తారని అన్నారు ఐశ్వర్య. ‘హీరో తిరువీర్ అద్భుతమైన నటుడు. ఆయన్ను చూస్తే మా నాన్నగారిని చూసినట్లే ఉంది. హైట్, పర్సనాలిటీ అంతా ఆయనలాగే ఉంటారు.’ అని అన్నారు.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎంటర్టైనర్ ఓ సుకుమారి. దర్శకత్వం వహించగా… ఝాన్సీ, మురళీధర్ గౌడ్, ఆనంద్, అంజిమామ, శివానంద్, కోట జయరామ్ కీలక పాత్ర పోషించారు. గంగా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలికరించారు.
Also Read : Nivetha Pethuraj: వెంకీతో ఐటమ్ సాంగ్… చిరు సినిమాలో రోల్ కాదు… ఇదీ నివేదా రీ ఎంట్రీ సినిమా
గమనిక : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్లు, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

