రావు బహదూర్ : విభిన్నమైన పాత్రలు , సినిమాలు చేస్తూ , కెరీర్ లో పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు చేయలేకపోయారు , ఆడియన్స్ లో బలమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్య దేవ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ భారీ అంచనాల నడుమ విడుదలై , కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓవర్సీస్ లో అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లే (…)
రావు బహదూర్ : విభిన్నమైన పాత్రలు , సినిమాలు చేస్తూ , కెరీర్ లో పెద్దగా కమర్షియల్ సక్సెస్ లు చేయలేకపోయారు , ఆడియన్స్ లో బలమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోల్లో ఒకరు సత్య దేవ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రావు బహదూర్’ భారీ అంచనాల నడుమ విడుదలై , కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఓవర్సీస్ లో అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లే వచ్చాయి కానీ , తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆసించిన స్థాయిలో పరుగులు రాలేదు. ఫలితంగా కేవలం 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా దర్శకుడు కావడంతో పాటు, మహేష్ బాబు నిర్మాతగా ట్రేడ్ లో అంచనాలు భారీగా ఉండేవి. దానికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ట్రేడ్ విశ్లేషకులు అందించే సమాచారం ప్రకారం , ఈ విడుదల విడుదలకు ముందు 11 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ విడుదల తర్వాత కేవలం 6 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అంటే దాదాపుగా 50 శాతం నష్టాలు అన్నమాట. వెంకటేష్ మహా ప్రేక్షకులకు అర్థం కాకుండా ఈ సినిమా ప్రదర్శించడం వల్లే , ఈ సినిమా విడుదలైన కొత్తల్లో విమర్శకులు కామెంట్స్ చేశారు. లేకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. వాళ్ళతో కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం , ఈ సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలి. నాలుగు వారాలు పూర్తి అవ్వడం తో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.
ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళం , మలయాళం , హిందీ మరియు కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ చిత్రం , కనీసం ఓటీటీలో అయినా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఈమధ్య కాలం లో థియేటర్స్ లో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలకు , ఓటీటీ లో అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.

