ధురంధర్ 2 OTT: బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్’ సిరీస్ సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణంగా విడుదలైన ‘ధురంధర్’ చిత్రం, సినిమాటిక్ అనుభూతికి పరాకాష్ట లాంటిది. ఒక సినిమాని ఎంత అద్భుతంగా తియ్యాలి , ఎంత ఎంగేజింగ్ గా తియ్యాలి , స్క్రీన్ ప్లే తో ఎలా ప్రేక్షకులను కట్టిపారేయొచ్చు వంటి విభాగాల్లో , ఫిలిం స్కూల్స్ కోచింగ్ కోసం ఈ విద్యార్థులకు చూపించవచ్చు. అలాంటి వెండితెర అద్భుతం ఇది. అందుకే ఆడియన్స్ ఈ నెత్తిన పెట్టుకొని ఆదరించారు కేవలం హిందీ వెర్షన్ తోనే 1380 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 1870 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. అయితే 50 రోజులు పూర్తి అయ్యాక ఓటీ లో విడుదల చేయాలి కాబట్టి , రీసెంట్ గానే ఈ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈ నెల 15 వ తారీఖు నుండి ఈ చిత్రం తెలుగు , తమిళం , హిందీ , మలయాళం , కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ట్విస్ట్, ఇది కేవలం ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇండియన్ ఆడియన్స్ కి రావడం కష్టం. ఎందుకంటే ఇండియాలో ఈ చిత్రం కేవలం జియో హాట్ స్టార్ లోనే అందుబాటులోకి రానుంది. ముందుగా ఈ నెల 15న ఈ హాట్ స్టార్ విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల , ఈ సినిమా జూన్ 4 కి వాయిదా పడింది.
దీనితో ఈ మన పైరసీ రాయులు ఓవర్సీస్ నుండి HD ప్రింట్ డౌన్ లోడ్ చేసి ఇంటర్నెట్ లో పెట్టేశారు. అత్యధిక శాతం ఇండియన్ ఆడియన్స్ ఇంటర్నెట్ లో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు. ఇలా జరగడం వల్ల, జియో హాట్ స్టార్ సంస్థకు వందల కోట్లలోనే నష్టం జరుగుతుందని, ఒకేసారి విడుదల చేయకుండా చాలా పెద్ద తప్పు చేసి సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం నెట్ ఫ్లిక్స్ లోసీ ఓవర్స్ ఆడియన్స్ ఈ ఎగబడి చూస్తున్నారట. ముఖ్యంగా పాకిస్థాన్ దేశం లో ఒక్కసారిగా అందరూ ఈ చిత్రం ఓపెన్ చేయడంతో నెట్ ఫ్లిక్స్ ఆ దేశం లో కొంతసేపు క్రాష్ అయ్యిందని అంటున్నారు.

