అమరావతి: బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేయడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోట్లూరి గ్రామానికి చెందిన ఈశ్వర్(19) అనే యువకుడికి, 15 ఏళ్ల బాలిక సోషల్ మీడియాలో పరిచయమైంది. పరిచయం స్నేహంగా మారడంతో పలుమార్లు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకోవడంతో పాటు కలుసుకునేవారు. బాలికకు మాయమాటలు చెప్పి కాజీపేటలో ఓ లాడ్జ్ కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై ఈశ్వర్ అత్యాచారం చేశాడు. వెంటనే ఆమె ఇంటి వద్ద బైక్ పై డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో వెంటనే ఆసుపత్రికి. వైద్యుల సూచన మేరకు ఆమెను కడప రిమ్స్ ఆసుపత్రికి. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

