ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి
విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజావాణికి వినతిపత్రం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకోవటం శుభ పరిణామం. కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపు విషయంలో ‘కనీస వేతనాల కమిటి’ పరిగణనలలోకి తీసుకోకుండా వేతనాలు పెంచారు. సింగరేణిలో పనులు చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రైతు భరోసా రబీకి రెండు ఎకరాల వరకు ఇచ్చారు. ఖరీఫ్ కూడా ప్రారంభమవుతున్నందున వెంటనే రబీకి సంబంధించి రైతు భరోసా ఇవ్వబడుతుంది. రాష్ట్రంలో మార్క్‌ఫెడ్ ద్వారా మొక్క జొన్న కొనుగోలు చేయడాన్ని అభినందిస్తూ, రైతులకు మొక్క జొన్న కేసులు వెంటనే అందజేయడం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పేదలకు అందజేసే గ్రామసభలలో అర్హులను గుర్తించడం, ఆ గ్రామంలో కేటాయించిన ఇళ్లకు లబ్ధిదారులను గుర్తించడం, భూదాన భూముల్లో ప్రభుత్వ స్థలాలు హైదరాబాద్‌లో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలివ్వడం, గ్రేటర్20 ఇళ్ల స్థలాలు పట్టాలివ్వాలని, ఫీజు రీయింబర్స్‌మెంటును కొనసాగించండి, బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రతినిధి బృందం కోరింది.

