– ప్రకటన –
నవతెలంగాణ – ఉప్పునుంతల
మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కపాస్ కాంతి) కార్యక్రమంలో పత్తి రైతులకు హెచ్డీపీఎస్, ఐసీఎం విత్తనాల పంపిణీ శనివారం ప్రారంభించినట్లు ఉప్పునుంతల మండల వ్యవసాయ అధికారి రమేశ్ తెలిపారు. పత్తి హెచ్డీపీఎస్ విధానంలో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందని చెప్పారు. రైతులు శాస్త్రీయ సాగు విధానాలు, ప్రత్యామ్నాయ వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్యాన్ని పాటించాలని సూచించారు. హెచ్డీపీఎస్ విత్తనాలు పొందిన రైతులు అదే విధానంలో సాగు చేస్తే, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే పథకాల ప్రయోజనాలు నిలిపివేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతులు ఉన్నారు.
– ప్రకటన –

