లోక నాయకుడు కమల్ హాసన్ తమిళనాడు సీఎం, సహనటుడు విజయ్ ని కలిశారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ ఆయన కొన్ని డిమాండ్లను నూతన ముఖ్యమంత్రి ముందు ఉంచారు. వాటిలో ఓటికి 8 వారాల విండోని తప్పనిసరి చేయడం. అధిక శాతం తమిళనాడులో షూటింగ్ జరుపుకున్న సినిమాలకు 10 శాతం రాయితీతో పాటు 4 శాతం ఎంటర్ టైన్మెంట్ టాక్స్ తీసేయమని. ఇదంతా బాగానే ఉంది కానీ కొన్ని ప్రాక్టికల్ విషయాలు చూద్దాం.
సినిమా అనేది నిర్మాత సొత్తు. దాని మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. పన్నులు, షోల పరిమితులు, సెన్సార్ లాంటివి తన కంట్రోల్లో ఉంటాయి ఎంతకు అమ్మాలి, ఎంత నిడివిలో ఓటికి ఇవ్వాలంటే ప్రొడ్యూసర్ ఇష్టం. గవర్న వచ్చి నువ్వు రెండు నెలల తర్వాత డిజిటల్ లో అందుబాటులో రూల్ పెడితే చట్టప్రకారం. దానికి అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకుని అన్ని పార్టీల మద్దతు పొందాలి. ఎవరైనా కేసు వేస్తే దాని కోసం కోర్టుల చుట్టూ తిరగాలి.
ఇదంత సులభంగా తేలే వ్యవహారం కాదు. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమలో అగ్ర నిర్మాతలు ఎనిమిది వారాల ఓటిటి విండోకి ఒప్పుకోవడం లేదు. నాలుగు వారాల నిడివి వల్లే పెట్టుబడులు రికవర్ అవుతున్నాయని, ఇప్పుడు దాన్ని సవరిస్తే ఓటిటి కంపెనీలు పెద్ద కోత పెడతాయని అంటున్నాయి. కమల్ నుంచి మరో డిమాండ్ ఉంది. ప్రభుత్వమే ఒక ఒటిటి ఏర్పాటు చేసి సరసమైన ధరలకు వినోదాన్ని అందించడం. ఇది ఇంకా కష్టం.
ఎందుకంటే సంక్షేమానికి నిధులు లేక రూలింగ్ పార్టీలు కిందామీదా పడుతున్న టైంలో నిర్మాతల దగ్గర భారీ డబ్బులకు ఓటి హక్కులు కొని దాన్ని తక్కువ రేట్లకు ఆడియన్స్ కి ఇచ్చి మైంటైన్ చేయడం లేదు శిరోభారం. అయితే విజయ్ సినిమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దేని గురించి అయినా సానుకూలంగా వచ్చే ఛాన్స్ ఉంది. అయినా స్టాలిన్ ఉన్నప్పుడు ఆయనకు మద్దతు ఇచ్చిన కమల్ హాసన్ కు ఆ టైంలో ఇవేవి గుర్తుకు రాకపోవడం, అడగకపోవడం మహా విచిత్రం.

