కరకగూడెం, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను కరకగూడెం మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు శుక్రవారం నిర్వహించారు. మండల కేంద్ర నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం స్థానిక పీహెచ్సీలో రోగులకు.. పంచాయతీ పారిశుధ్య కార్మికులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేటీఆర్ భావితరాలకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. కేటీఆర్ సారధ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానున్నదని చెప్పారు. కేటీఆర్ విజన్ ఉన్న నాయకుడని నినాదాలు చేస్తూ కార్యకర్తలు బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, కొమరం రాంబాబు, పోగు వెంకటేశ్వర్లు, అత్తె సత్యనారాయణ, రేగా సత్యనారాయణ, కనకయ్య, ఫజల్, ప్రవీణ్, ఆయా పంచాయతీల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కొనసాగుతున్నారు.

