తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త బొగ్గు మంటలు రేగుతున్నాయి. తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు రాజకీయ పార్టీల మధ్య తీవ్ర యుద్ధానికి దారితీసింది. క్రెడిట్ నాదంటే నాదని కాంగ్రెస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. 2020 తర్వాత బహిరంగ వేలం లేకుండా, నామినేషన్ పద్ధతిలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు గాని దక్కడం వెనుక అసలు రాజకీయం ఏంటి..? కిషన్ రెడ్డి వ్యూహం ఏంటి..? కాంగ్రెస్ ఎందుకు డిఫెన్స్‌లో పడింది..? గతంలో తాడిచర్ల-1 చుట్టూ తిరిగిన గులాబీ నీడలు, ఇప్పుడు ఆ పార్టీని ఎలా ఆత్మరక్షణలోకి నెట్టేశాయి..? సింగరేణిని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ మైండ్ గేమ్స్ వెనుక అసలు కథేంటి..?
తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణి సంస్థ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక తీసుకున్న ఒక నిర్ణయం… ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపింది. భూపాలపల్లి ఏర్పాటు తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను నేరుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడమే ఈ రచ్చకు కారణం. ఇది కేవలం బొగ్గు గాని కేటాయింపు మాత్రమే కాదు. దీని వెనుక పక్కా పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయనే చర్చ నడుస్తోంది. తాడిచర్ల సింగరేణికి ఖాతా కేటాయింపు జరగడమే ఆలస్యం… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి క్రెడిట్ అంతా కాంగ్రెస్‌లో వేసుకునే ప్రయత్నం చేశారు. 2013లోనే యూపీఏ హయాంలో ఈ ప్రక్రియ మొదలైందని, తాము అధికారంలోకి వచ్చాక కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి వల్లే గని దక్కిందని చెప్పుకొచ్చారు. అయితే, దీనికి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చింది కాషాయదళం. 2020లో కేంద్రం తెచ్చిన మైనింగ్ పాలసీ ప్రకారం అన్ని బొగ్గు గనులను బహిరంగ వేలం ద్వారా కేటాయించాలి. కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం, సింగరేణి మనుగడ కోసం కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నామినేషన్లో నేరుగా ప్రభుత్వ సంస్థకు కేటాయించినట్లు బీజేపీ గట్టిగా వాదిస్తోంది.
2020 తర్వాత దేశంలో ఇలా వేలం లేకుండా ఒక ప్రభుత్వ రంగానికి గని ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ క్రెడిట్ వార్ ఇలా ఉంటే… ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. గతంలో తాడిచర్ల-1 బ్లాక్ కేటాయింపు, అక్కడ జరిగిన మైనింగ్ కాంట్రాక్టులపై భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు నేతలు, వారి బంధువులు, తమకు అనుకూలమైన ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టి వందల కోట్లు వెనకేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణిని కేవలం నోడల్ ఏజెన్సీగా వాడుకుని, లాభాలన్నీ ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తాడిచర్ల-2 విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగు వేసింది. ఈ మైనింగ్ బ్లాక్‌ను పూర్తి స్థాయిలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా, నేరుగా సింగరేణికే అప్పగించింది. దీనివల్ల గతంలో జరిగినట్లుగా ప్రైవేట్ వ్యక్తులు, నిర్దిష్ట రాజకీయ శక్తులు పొందే లూప్‌హోల్స్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడింది. అటు ప్రైవేటీకరణ అంటూ గగ్గోలు పెట్టే కాంగ్రెస్ నోరు నొక్కేయడమే కాకుండా, ఇటు బీఆర్ఎస్ గత వైఫల్యాలను, అవినీతి ఆరోపణలను మరోసారి తెరపైకి తెచ్చేలా బీజేపీ ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.
దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు ఈ విషయంలో ఏం మాట్లాడలేక ఆత్మరక్షణలో పడిపోయిందని అంటున్నారు. బీఆర్ఎస్ గట్టిగా నోరువిప్పితే అనేక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వేచిచూస్తే ధోరణి అవలంబిస్తోంది. కేంద్రంతో నేరుగా ఢీకొడితే సింగరేణి ప్రయోజనాలకు గండి పడుతుందని భావిస్తున్నారు. అందుకే, రాజకీయంగా విమర్శలు గుప్పిస్తూనే… అంతర్గతంగా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించక తప్పని పరిస్థితి. తెరవెనుక పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ నడుస్తోంది. కిషన్ రెడ్డి తన శాఖ ద్వారా తెలంగాణలో కాషాయ జెండాకు మైలేజ్ ఇచ్చేలా వ్యూహం రచిస్తే… కాంగ్రెస్‌ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. ఇక గత వ్యవహారాలు వెంటాడుట అయిపోయింది బీఆర్ఎస్ సైలెంట్.

