విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాకతీయ విద్యకేతన్ ఇంగ్లీష్ మాధ్యమం హై స్కూల్ నందు 2026_2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యార్థుల విద్యార్థుల కొరకై.. విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మాక్ ఎలక్షన్స్ (ప్రత్యక్ష ఎన్నికలు) నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ ప్యూపిల్ లీడర్,అసిస్టెంట్ స్కూల్ ప్యూపిల్ లీడర్, కల్చర్ , స్పోర్ట్స్ కమిటీ పదవుల కోసం పోటీపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానాల పట్ల విద్యార్థుల ప్రాథమిక అడుగుల కోసం విద్యార్థులకు చిన్ననాటి నుండే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగించడం కోసం ఈ మాక్ పాఠశాలల్లో నిర్వహించామని తెలిపారు.
పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శెట్టిపి పద్మ , డైరెక్టర్లు శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి , శెట్టిపి హార్జిత్ ప్రణవ్ రెడ్డి , మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. విధానంలోనే తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.
ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన విద్యార్థుల బృందమును ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసారు.

