జైపూర్: కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. అభిజీత్ జై వ్యతిరేక సిజెపి పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నాటకీయ మలుపు తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్ ఎటాక్ చేశారు. జనం మధ్యలో కార్యకర్తలు ఆయనను భుజాలపై మోస్తూ తీసుకెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా అతనిపై కొందరు దాడి చేస్తూ చెంప దెబ్బలు కొట్టారు. దీంతో పార్టీ కార్యకర్తలు అభిజిత్ ను కొట్టిన వారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ అక్కడ గందరగోళం, ఘర్షణ చెలరేగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

