తెలంగాణ:కొమరంభీం జిల్లా, కాగజ్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడు సయ్యద్ అజహర్ ( సయ్యద్ అజర్ )(27)కు ఆదిలాబాద్ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయస్థాన శిక్ష విధించింది.2020 అక్టోబర్ 23న ఫిర్యాదుదారు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి,ప్రేమ పేరుతో యువతి వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.సీసీటీవీల్లో నమోదైన ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రం నమోదు చేసింది.

