జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం సరస్వతి అంత్య పుస్కారాలలో భాగంగా గోదావరిలో పుణ్య స్నానం ఆచరించమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అనంతరం గోదావరి మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో సరస్వతి పుష్కరాలు గత సంవత్సరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తే ఈసారి అంత్య పుష్కరాల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో లక్షలాదిమంది సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొని పుణ్య స్నానము ఆచరించామని వివరించారు. భవిష్యత్ లో మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రమంతా సుభిక్షమైన వర్షాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా రైతులు పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నామని పొన్నం తెలియజేశారు. భారత్ లో కాశీ విశ్వేశ్వర పండితులు గురువు లోక కళ్యాణం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది జరుగుతుందని తెలుస్తుంది. కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి వారి ఆలయం అక్కడ కాశి విశ్వేశ్వర స్వామి..ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారు కొలువుదీరారని,ప్రతి ఒక్కరికి శుభం జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని పొన్నం చెప్పారు.

