వచ్చే వారం విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీకి ఏదైనా సమస్య ఉందంటే, అది ఒక్క రోజు ముందు జన నాయకుడు రిలీజ్ కావడమే. అయితే కంటెంట్ మీద కాన్ఫిడెంట్ గా ఉన్న టీమ్ దాన్నో అడ్డంకిగా భావించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్న ప్రముఖ సంస్థ కాబట్టి థియేటర్ల పరంగా తగినన్ని దొరకవేమోననే అనుమానం మీడియా నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ అలాంటిదేమి ఉండదని, పైగా వారికి థాంక్స్ చెప్పే సందర్భం త్వరలోనే వస్తుందని నిర్మాత ఎస్కెఎన్ చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఈ విషయం గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ తెలుగు ఆడియన్స్ ముందు చెన్నై లవ్ స్టోరీకే ప్రాధాన్యత ఇస్తారని, పైగా జన నాయకుడు కేసరి రీమేక్ కాబట్టి మన జనాలు అంతగా ఆసక్తి చూపవచ్చనే అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. ఆ లాజిక్ సరైందే. ఎందుకంటే బాలకృష్ణని చూసిన పవర్ ఫుల్ క్యారెక్టర్ లో మళ్ళీ విజయ్ ని కొత్త ఓన్ చేసుకోవడం అంత ఈజీగా ఉండదు. తమిళ అభిమానులు వేరు కాబట్టి అక్కడ గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది.
ఏపీ తెలంగాణలో జన నాయకుడుకి ఎక్కువ స్క్రీన్లు దక్కినా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఆయన ప్రభావం ఇక్కడ ఉందని చెప్పడానికి లేదు. తుపాకీ నుంచి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం వరకు ఆయన చేసినవన్నీ స్ట్రెయిట్ సబ్జెక్టులే. జన నాయకుడు ఫక్తు రీమేక్ అనే విషయం ట్రైలర్ లోనే బయట పడింది. విజయ్ మీద విపరీతమైన అభిమానం ఉన్న తెలుగు ఫ్యాన్స్ ఫస్ట్ డే వెళ్తారు కానీ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం టాక్, రివ్యూస్ కోసం ఎదురు చూస్తారు.
ఈ చెన్నై లవ్ స్టోరీ వాడుకోవాలి. కంటెంట్ మీద విపరీతమైన నమ్మకాన్ని చూపిస్తున్న టీమ్ ముందు రోజు ప్రీమియర్లకు రెడీ అవుతోంది సమాచారం. బేబీకి ఫాలో అయిన స్ట్రాటజీనే దీనికీ పాటిస్తారని తెలిసింది. దాని వల్ల రిలీజ్ రోజు ఉదయం పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో వచ్చేస్తే మంచి ఓపెనింగ్స్ కి దారి దొరుకుతుంది. దర్శకుడు రవి నంబూరి కన్నా నిర్మాత కం రచయిత సాయి రాజేష్ ప్రమోషన్స్ లో హైలైట్ కావడం గమనించాల్సిన విషయం.

