మేడ్చల్ మల్కాజ్గిరి: క్యాబ్ డ్రైవర్‌పై సినీ నటుడు దాడి చేసిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీహరి అనే యువకుడు క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుకింగ్ కోసం నాగరం చౌరస్తాలో పక్కకు కారు నిలిపాడు. సినీ నటుడు సుప్రీత్ రెడ్డి అలియాస్ కాట్రాజ్ కారులో అక్కడికి వచ్చాడు. రోడ్డుకు అడ్డంగా ఉన్నావని శ్రీహరితో గొడవకు దిగాడు. కోపంతో క్యాబ్ డ్రైవర్‌ను తిట్టడంతో పాటు సినీ నటుడు తీవ్రంగా కొట్టాడు. వెంటనే వందకు ఫోన్ చేసి పోలీసులకు డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

