రేపు శ్రీనివాస మంగాపురం విడుదల. ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా తన మీద పెద్ద బాధ్యత ఉంది. మహేష్ బాబు రాజకుమారుడు విడుదలైన జూలై 30న దీన్ని విడుదల చేయడం సమర్పకులు అశ్వినిదత్ సెంటిమెంట్ గా నిలిచింది. ఈ పరిశీలన మహేష్ తన వీడియో బైట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అన్న కొడుకు కోసం మహేష్ బాబు ప్రత్యక్షంగా ఎలాంటి ఈవెంట్ లో పాల్గొనకపోవడం కొన్ని విమర్శలు తెచ్చి పెట్టింది.
జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కొన్నేళ్ల క్రితం కాలం చేశారు. తాత కృష్ణ చనిపోయి సంవత్సరాలు దాటేసింది. నాన్నమ్మ కూడా లేదు. తల్లికి సినిమా రంగంతో నేరుగా పరిచయం ఆశించలేం. సో ఎటు చూసినా తోడు ఉండాల్సింది బాబాయ్ మహేష్ బాబే. ఏదైనా వేడుకకు ప్రత్యక్షంగా వచ్చి నాలుగు మాటలు చెప్పి ఉంటే బజ్ పెరిగేదని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ ని వారణాసికి తప్ప వేరే పబ్లిక్ ఈవెంట్ లో చూడలేదు.
సరే మహేష్ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్ రంగంలోకి దిగి శ్రీనివాస మంగాపురంకు మైలేజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్ని చోట్ల ఉదయం బెనిఫిట్ షోలు సెలబ్రేషన్స్ తో పాటు కుర్రాడు తమ సపోర్ట్ ఉందనే సందేశం ఇస్తున్నారు. సీనియర్ అభిమానులకు రమేష్ బాబు బాగా గుర్తు. సామ్రాట్ నుంచి ఎన్ కౌంటర్ వరకు ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఒక నటుడిగా కృష్ణగారబ్బాయిగా ఆ గౌరవాన్ని ఇప్పటికీ పెట్టుకున్నారు.
కాబట్టి ఇక అసలు బాధ్యత దర్శకుడు అజయ్ భూపతి మీద ఉంది. కమర్షియల్ ఫార్మాట్ లో ప్రేమకథ చెప్పబోతున్న వైనం ట్రైలర్ లో కనిపించింది. మోహన్ బాబు అంతటి సీనియర్ హీరో ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారంటే మ్యాటర్ ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు మరీ వైరల్ కా బజ్ కొంచెం అటుఇటు అవుతోంది. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రష తదాని ఈ సినిమాతోనే పరిచయమవుతూ డెబ్యూనే పెద్ద బ్రేకవుతుందని ఎదురు చూస్తోంది.

