విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూడూరు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయ స్వామి ఉత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించిన సరిగెత్తు కార్యక్రమంలో గూడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం ముందు కోలాటం ప్రదర్శించి భక్తులను అలరించారు.విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ప్రదర్శించిన భక్తులు ఆసక్తిగా తిలకించి చప్పట్లతో అభినందించారు. ఉత్సవాల్లో విద్యార్థుల భాగస్వామ్యం సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దవారిని తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, కమిటీ చైర్మన్ నాగార్జున, కమిటీ సభ్యురాలు పొన్నతోట వనజాక్షి, గ్రామ ప్రస్తుత అధికారి పి. శివరామ్, జాఫర్ వలి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

