బాలీవుడ్ అగ్ర కథానాయికలో ఒకరైన కియారా అద్వానీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన సహ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డ సంగతి అని తెలుస్తుంది. అలా అని ఆమె సినిమాలేమీ వదిలేయలేదు. టాప్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. గత ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా ఆమె కెరీర్లో దూసుకెళ్తోంది.
పెళ్లి తర్వాత కూడా ఫుల్ గ్లామరస్ రోల్స్ చేస్తూ తాను ఆధునిక అమ్మాయిని అని చాటుతున్న కియారా.. తాజాగా ఒక ప్యాడ్ కాస్ట్లో కూతురు సరయా విషయంలోనూ అంతే ఆధునికంగా ఉంటానంటూ కొన్ని కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
ప్రస్తుతం సమాజంలోని అబ్బాయిల గురించి మీ అమ్మాయికి ఏం చెప్తారని ప్రశ్నించగా.. అందుకు జవాబు విమర్శలకు దారి తీసింది. త’న కూతురు ఎంత మందితోనైనా డేటింగ్ చేయొచ్చని, వారిలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోకపోయినా ఫర్వాలేదని ఆమె కామెంట్ చేసింది.
”నా కూతురు ఫుల్ లైఫ్ చూడాలని అనుకుంటా. ఆమె ఒక్క వ్యక్తితోనే డేటింగ్ చేయలేదు. ఆమెపై ఎలాంటి ఆంక్షలు విధించను. పెళ్లి చేసుకోవాలనుకుంటే. లేదంటే లేదు. డేట్ చేసిన ప్రతి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు అలాగే జరిగింది. చివరకు సరైన వ్యక్తి దొరికాడు. మన రిలేషన్షిప్స్ విషయంలో పశ్చాత్తాపం అవసరం లేదు. ఎదిగే ఈ రిలేషన్షిప్స్ అన్నీ పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని మనిషిగా మారుస్తాయి. జీవితాన్ని పూర్తిగా అనుభవించాలి. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి నేర్చుకుంటారు” అని కియారా వ్యాఖ్యానించింది.
ఐతే ఈ వ్యాఖ్య’లపై సంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. ఇదేనా మన కల్చర్..పిల్లలకు ఇదేనా నేర్పించేది అని ప్రశ్నిస్తున్నారు. రిలేషన్‌షిప్స్‌ను ఇంత తేలిగ్గా తీసుకోవటం.. ఎంతమందితో అయినా డేట్ చేయమని ఒక తల్లి చెప్పటం కరెక్టా అని అడుగుతున్నారు. ఐతే కియారా చెప్పిన దాంట్లో తప్పేముందని.. కాలం ఎంతో మారిందని, అందులోనూ కియారా కూతురు ఎదిగే సమయానికి ఉండే పరిస్థితులకు తగ్గట్లే కియారా మాట్లాడుతోందని ఆమెను కొందరు సమర్థిస్తున్నారు.

