- సోషల్ మీడియా కట్టడి అవసరం
గోదావరిఖని, వెలుగు: కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే దేశంలో జర్నలిస్టులకు రక్షణ కరువైందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి అన్నారు. కోల్‌బెల్ట్ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ జీవిత చరిత్రపై ముద్రించిన ‘మునీర్‌భాయ్’ పుస్తక పరిచయ సభను మంగళవారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన గోదావరి జిల్లా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో పెట్టుబడిదారుల చేతుల్లోకి మీడియా రంగం నుండి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లతో సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిస్టులను, కూలీలను ఓకే గొడుగు కిందకు తీసుకువచ్చారని, ఇది తీరని నష్టమన్నారు. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం వల్ల విచ్చలవిడితనం పెరిగిపోతోందని, దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
జర్నలిజాన్ని నమ్ముకుని జీవితాంతం అన్యాయాన్ని, పాలకుల లోపాలను ఎత్తిచూపుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్న జర్నలిస్ట్ మునీర్ జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జర్నలిస్టులకు త్వరలోనే ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు నిర్మించబడుతుందని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రకటించారు. అక్షర ఫౌండేషన్ అక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ మాదాసి రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మాధవరావు, జర్నలిస్ట్ సంఘాల లీడర్లు నగునూరి శేఖర్, ఎం.వంశీ, సంపత్ కుమార్, గడ్డం శ్యామ్, కోల సంఘం, పి.శ్యామ్ టిడర్ సంఘాలు, కార్మిక, కె.ఎస్. అహ్మద్, పి.మల్లికార్జున్, పర్లపల్లి రవి, ఐ.కృష్ణ, కె.విశ్వనాథ్, తోకల రమేశ్, రచయితలు ఉన్నారు.

