తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వారి బొల్లారం గ్రామం వద్ద స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో(ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ) కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వేములవాడ -సిరికొండ రోడ్డు విస్తరణ పనులకు రూ.23 కోట్లతో శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, గత ప్రభుత్వాల పాలన వల్ల తెలంగాణ నష్టపోయిందని అన్నారు.

