ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గండాల సంతోష్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్మవరంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వారి దిష్టిబొమ్మను కళాజ్యోతి సర్కిల్ వద్ద ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గండాల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా AIYF రాష్ట్ర అధ్యక్షులు గండాల సంతోష్ కుమార్, మాజీ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా ఉన్నారు. అనంతరం
గండాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ, నీట్లో జరిగిన పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర వైఫల్యాల వల్ల లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్ టి ఏ) వైఫల్యానికి కేంద్ర విద్యాశాఖ నైతిక బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో సుమారు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇలాంటి పరిస్థితులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉందని ప్రభుత్వంపై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. అందుకే పలు డిమాండ్లతో
జూన్ 6వ తేదీ నుంచి విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావేత్తలు, ప్రముఖ శాస్త్రవేత్తలు చేపట్టిన నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా విశేష మద్దతు లభించింది. జూన్ 20న నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో విద్యార్థులు, యువత, వివిధ ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అయితే శాంతియుతంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు. ప్రజల గొంతు నొక్కే విధంగా వ్యవహరించడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని వారు స్పష్టం చేశారు. ఈ ఘటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, సత్యసాయి జిల్లా ఐఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేశామని మరోసారి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రవికుమార్, వెంకటనారాయణ కొనసాగుతున్నారు.

