బీఆర్ఎస్ యువసంగ్రామ సభ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ కామెంట్స్ పై సూచనూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ మాటలకు మేము స్పదించడం అవసరమా అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ పోరాటం, ఆరాటం అంతా వాళ్ళ ఉద్యోగాల కోసమేనని అన్నారు. వీళ్ల గాయిలో పడి నిరుద్యోగులు మోసపోవద్దని హితవు పలికారు అద్దంకి.
కేటీఆర్ హరీష్ లు చిల్లర గాళ్ల కంటే వెరీ చీప్ అని… కేటీఆర్ భాస్కర్ అవార్డు లాంటి వాడని అన్నారు. తనకు తానే సర్వేలు చేసుకొని మేమే వస్తున్నాం అని ప్రచారం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు అద్దంకి దయాకర్. నెత్తి మీద రూపాయి పెడితే సామెత కేటీఆర్ కు సెట్ అయితదని అన్నారు.
ఇంకా చదవండి: బేవకూఫ్ మాటలు మానుకో కేటీఆర్
కేటీఆర్ నాన్ సీరియస్ పొలిటీషియన్ అని… కేటీఆర్ ఉంటే జోక్స్ ఉంటాయి.. రాజకీయాల్లో కేటీఆర్ ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ముసలి నక్క అయితే కేసీఆర్ యువ నక్క నా అంటూ ఎద్దేవా చేశారు. మాకు పదవులు వస్తే మీకు అలసిస్తుందని.. 20 ఏండ్లు పార్టీ కోసం కష్టపడితే పదవులు వచ్చాయనీ… పార్టీని కాపాడుకుంటాం కాబట్టి పదవులు వచ్చాయనీ అన్నారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్… ట్రోల్స్ మానుకో.. రెచ్చగొట్టి విద్యార్థులను చంపిన వ్యక్తులు మీరు అంటూ ఫైర్ అయ్యారు అద్దంకి దయాకర్.

