పవన్ కళ్యాణ్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా , ఇలా ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించి చర్చ. ఈ స్థాయిలో ఒక ఆంధ్ర నాయకుడు చుట్టూ తెలంగాణ రాజకీయాలు గడిచిన 12 ఏళ్ళలో ఎప్పుడూ జరగలేదు. జనసేన పార్టీ ని తెలంగాణ లో యాక్టీవేట్ చేయడానికి తాజా రాజకీయ పరిణామాలు దోహదపడ్డాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడి నుండి పవన్ కళ్యాణ్ సరైన ప్లానింగ్ తో ముందుకు వెళ్తే ఆయనకు తెలంగాణ లో మంచి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద సంచలనం గా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాకుండా, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు కూడా స్పందించారు.
నేడు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో , ఆయన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై చాలా ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఒక సినీ హీరో గా మేమంతా అభిమానిస్తాం , ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి గారికి ఎంతో గౌరవం ఇస్తాం , మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ కూడా పెట్టిస్తాను , కానీ మా రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోము , తెలంగాణ మా అయ్యా జాగీరా అని అంటున్నాడు , అవును , పవన్ మా అయ్యా జాగీరే , తెలంగాణ రాష్ట్రము నాలుగు కోట్ల మంది కళ్యాణ్ గారు మాట్లాడలేదు , తెలంగాణా రాష్ట్రము, భూమిపుత్రుల జారె గారు ఓజీ సినిమా తీసాడు , మా తెలంగాణ రాజకీయాలకు ఓజీ కేసీఆర్, మరో ఓజీ అవసరం లేదు ‘ అంటూ ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారం రేపాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళి అర్పిస్తూ , ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ గారు ఏం మాట్లాడాడో నాకు తెలియదు , ఇంకా నేను చూడలేదు , కానీ ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది , అన్నాదమ్ముల అనుబంధం మాది , కచ్చితంగా నా గురించి తప్పుగా అయితే మాట్లాడలేదు’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. దీనిని బట్టీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా తెలంగాణ లో రాజకీయాలు నడిపేందుకు చూస్తున్నాడని అర్థం అవుతోంది.

