కేదార్ నాథ్, బద్రీనాథ్ యాత్రలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో కేదార్ నాథ్, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ తీర్థ యాత్రలను ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. కొండచరియలు విరిగిపడుతుండటంతో ఈ యాత్రను రద్దు చేసింది.
భారీ వానలతో…
పై హిమాలయ ప్రాంతంలో ఎడతెరపి వాన పడనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భక్తులు పోటెత్తడంతో ఆలయ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు అధికారులు వాహనాలను నిలిపివేయనున్నారు.

