హైదరాబాద్ సిటీలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు చేపట్టిన ప్రాజెక్టు పనులు జీహెచ్‌పీ వేగవంతం చేసింది. ఆదివారం (మే 17) కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించబడింది. సెపరేటర్ కారిడార్ ప్రాజెక్ట్ పై వీడియో రిలీజ్ చేసింది.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రోడ్ నంబరు 45,జూబ్లీ చెక్ పోస్ట్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు బీఆర్ పార్క్ చుట్టూ భారీ ప్రాజెక్ట్ నిర్మించబడింది. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్‌కు ఎలాంటి నష్టం లేకుండా ఈ నిర్మాణం చేపట్టనున్నారు. జీరో పార్క్ ఇంట్రూజన్ తో రోడ్డు మీడియన్స్ లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ కోసం కేబీఆర్ పార్క్ లోని ఒక్క చెట్టును కూడా నరకబోమన్న అధికారులు స్పష్టం చేశారు.
కాంక్రీట్‌కు బదులుగా ఫ్లైఓవర్ల ఎంపికను ఇస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. స్టీల్ నిర్మాణాలతో పనులు 30–40 రెట్లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
సెంట్రల్ మీడియన్ లో ఉన్న చెట్లను ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వారా సురక్షితంగా తరలించబడుతుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి ఫిలింనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ కారిడార్ గా మార్చబోతున్నట్లు చెప్పారు. రోడ్ నెం.45, ఫిల్మ్‌నగర్, క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా జంక్షన్లు కలిపే ఈ ప్రాజెక్టు పూర్తయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో వాయు కాలుష్యం 72 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
ట్రాఫిక్ తగ్గడంతో 40 కోట్ల లీటర్లకు పైగా ఇంధన ఆదా అంచనా అవుతోంది. 13.66 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల నియంత్రణను లక్ష్యంగా చేసుకుని జూబ్లీహిల్స్–మాదాపూర్ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఈప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి, పర్యావరణ సమతూకంతో గ్రీన్ హైదరాబాద్ ప్రాజెక్ట్ కొనసాగుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
KBR పార్క్‌లో కొత్త ప్రాజెక్ట్ #KBRపార్క్ #GHMC #రేవంతరెడ్డి #హైదరాబాద్ #తెలంగాణ pic.twitter.com/jEGdlw3H2T
— చంద్ర శేఖర్ పమేనా (@PamanaChan58316) మే 17, 2026

