కేశినేని నానిపై పోలీసులు కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేశినేని నానపై కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం గురించి కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
చిన్ని ఫిర్యాదుతో…
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా కేశినేని నాని ఫిర్యాదు చేయడమే కాకుండా, చంద్రబాబుకు లేఖలు రాయడం చికాకుగా మారడంతో చిన్ని కేశినేని నానిపై ఫిర్యాదు చేసినట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

