ఏ తండ్రికైనా కొడుకు జీవితంలో విజయం సాధిస్తే పుత్రోత్సాహం ఏ రేంజ్ లో ఉంటుందో మాటల్లో చెప్పలేము. మీరు కూడా తండ్రి అయ్యి , మీ కొడుకు జీవితంలో సక్సెస్ అయితేనే ఆ అనుభూతి విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి అనుభూతి అక్కినేని నాగార్జున పొందుతున్నారు. అఖిల్ ఇండస్ట్రీలోకి ఏ రేంజ్ హైప్ తో ఎంట్రీ ఇచ్చాడో అందరికీ తెలిసిందే. ఆయన మొదటి సినిమా ఓపెనింగ్ వసూళ్లు స్టార్ హీరో రేంజ్ లో వచ్చాయి. అంతటి భారీ అంచనాల నడుమ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి డిజాస్టర్ ని అందుకున్నారు. ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ మాత్రమే ఎదురయ్యారు, ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం మాత్రమే కమర్షియల్ ఎబోవ్ యావరేజ్ గా నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ‘ఏజెంట్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆ సినిమా కూడా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక అఖిల్ పని అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయంలో విడుదలైన ‘లెనిన్’ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి. ఇక ఈ సందర్భంగా మూవీ టీం నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో అక్కినేని నాగార్జున మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడే ముందు ‘లెనిన్’ మూవీ ఆడియన్స్ నుండి వచ్చిన రియాక్షన్స్ కి సంబంధించిన వీడియో ని ప్లే చేశారు. దాన్ని చూసి అక్కినేని నాగార్జున బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన తీరు చూస్తుంటే, అఖిల్ సక్సెస్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది.
నాగార్జున మాట్లాడుతూ ‘ ముందుగా మా అభిమానులకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. ఆడియన్స్ ఎప్పటికీ మాతో ఉన్నారు , మంచి సినిమా తీస్తే బ్రహ్మరథం పడుతామని చెప్తూనే ఉన్నారు, కానీ అక్కినేని అభిమానులు మాత్రం నిజంగా దేవుళ్ళు. ఎన్ని అపజయాలు వచ్చినా మమ్మల్ని వాళ్ళ భుజాలపై మోసే విధానం కి సెల్యూట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగిన మరుసటి రోజు నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇప్పటి వరకు నేను దేవుడిని ఏది అడగలేదు , ఎందుకంటే మాకు అన్నీ ఉన్నాయ్, కానీ ఈ సినిమాలో అన్ని కుదిరాయి హిట్, కనీసం ఈసారైనా వాడికి వచ్చేలా చేయండి అని కోరుకున్నాను. నా కోరికను నెరవేర్చినందుకు వెంకటేశ్వర స్వామి కి థాంక్స్’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఈ వీడియో లో చూడండి.

