తెలంగాణ:కోడికూర విషయంలో జరిగిన గొడవలో కొడుకు చేతిలో తండ్రి హతమయ్యాడు.ఎస్ఐ శ్రీదేవి(ఎస్ఐ శ్రీదేవి) తెలిపిన వివరాల ప్రకారం.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లికి చెందిన రమేశ్( రమేష్ )(42) మంగళవారం రాత్రి నాటుకోడి కూర వండే విషయంలో భార్యతో గొడవపడ్డాడు.అడ్డువచ్చిన కొడుకును కొట్టాడు.
దీంతో ఆవేశానికి లోనైన కొడుకు రోకలిబండతో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్ తరలిస్తుండగా నేడు మృతి చెందాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

