గ్రే జంగిల్ఫౌల్ రక్షణ చట్టాలు: మనలో చాలామందికి ముక్క లేనిది ముద్ద దిగదు. ఉదయం టిఫిన్ లో, మధ్యాహ్నం భోజనంలో, రాత్రి డిన్నర్ లో ఇలా మూడు పూటలూ ముక్కలతోనే తినే మహానుభావులు చాలామందే ఉంటారు. నాన్ వెజ్ బాగా తినేవాళ్లకు రకరకాల వెరైటీలు కావాలి. అందులోనూ చికెన్ తినేవాళ్లకు కొత్తకొత్త డిష్ లు కావాలి. అందువల్లే నేడు మనదేశంలో చికెన్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
చికెన్ ఉత్పత్తి ఒకప్పుడు ఈ స్థాయిలో లేదు. ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కోళ్లను పెంచుతున్నారు. కంపెనీలు కోళ్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. విరివిగా ఫామ్ లు ఏర్పాటు చేయడంతో కోళ్ల ఉత్పత్తి భారీగా ఉంది. ఉత్పత్తికి, వినియోగానికి అంతరం అంతగా లేకపోవడంతో ఫౌల్ట్రీ వ్యాపారం మూడుపూలు, ఆరుకాయలుగా సాగుతోంది.
తెలుగురాష్ట్రాల్లో ప్రతిరోజు వందల క్వింటాళ్ల చికెన్ విక్రయాలు సాగుతుంటాయి. నాటు కోళ్లు, బ్రాయిలర్ అనే సంబంధం లేకుండా జనం లాగించేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా జన్నారంలో సంచరించే ఓ కోడిని వేటాడితే, దాని మాంసం తింటే మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీని వెనుక కారణం లేకపోలేదు. జన్నారం ప్రాంతంలో గ్రే జంగిల్ ఫౌల్ అనే కోడి సంచరిస్తూ ఉంటుంది. ఇది అత్యంత అరుదైనది. అందువల్లే దీనిని వణ్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ కోడిపుంజును వేటాడి తింటే మూడుపాటు జైలు శిక్ష పడుతుంది.
ఈ కోడి పుంజులు అడవిలో ప్రత్యేకంగా ఉంటాయి. మనుషుల అలికిడి వినిపించగానే పారిపోతాయి. ప్రాణాపాయం ఉంటే చెట్ల మీదికి ఎగిరిపోతాయి. గింజలను, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటారు. నేల మీద గూళ్లు నిర్మించుకుంటాయి. చెట్ల పై కూడా గూళ్లను ఏర్పాటు చేసుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం ప్రాంతంలో ఈ కోడి పుంజులు సంచరిస్తుంటాయి.

