- మంత్రులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
- ఇతర రాష్ట్రాల్లో కొత్త బొగ్గు బ్లాకులు సాధించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: కోల్ బెల్ట్ సమస్యలపై ప్రతి 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రస్తుత పోటీలో సింగ రేణి నిల దొక్కుకోవాలంటే ఇత ర రాష్ట్రాల్లో కొత్త బ్లాకుల గురించి సాధించాల ని యాజమాన్యానికి దిశానిర్దేశం చేశారు. అత్యంత నాణ్యమైన బొగ్గును మార్కెట్లో విక్రయించే దిశను గా ప్రయత్నాలు చేయాలని సూచించింది.
సోమవారం సెక్రటేరియెట్లో డిప్యూటీ సీఎం భట్టి ఆధ్వర్యంలో సింగరేణి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ స మావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధ ర్ బాబు, సీత క్క, ఎన ర్జీ స్పెష ల్ సెక్ర ట రీ న వ న్ మిట్ట ల్ , సింగ రేణి సీఎం జ్యోతి బుద్ధ ప్రకాష్ణ జ , సింగ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్ పొట్రు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, ఎంపీ బలరామ్ నాయక్ ఉన్నారు.
సింగరేణి అభివృద్ధికి సంపూర్ణ సహకారం
సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భట్టి అన్నారు. తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణి, కోల్ బెల్ట్ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ప వ నిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పార్టీ తరపున, ప్రభుత్వం ఇచ్చిన కోల్ బెల్ట్ లో హామీల అమలు విషయంలో కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధించగలిగే కొత్త బ్లాకులను సింగరేణి సాధించాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం సింగ రేణి తగు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
సమస్యలను విన్నవించిన ఎమ్మెల్యేలు
సింగరేణి ప్రాంతంలో సమస్యలను కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు భట్టి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న విజ్ఞప్తులను, సూచనలను తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి డిప్యూటీ సీఎం సూచించారు. ఒప్పందం ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి కోల్ బెల్ట్ శాసన సభ్యులు సమర్పించే విజ్ఞాపనలపై తీసుకున్న చర్యలపై సమీక్షించారు. సమీక్షలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గడ్డం వినోద్, విజయ రమణారావు, పాయం వెంకటేశ్వర్లు, గండ్ర సత్యనారాయణ, మట్టా రాగమయి, కోరం కనకయ్య, మాలోతు రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, కోవ లక్ష్మి ఉన్నారు.

