ముదిగుబ్బ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బ సీపీఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్‌తో చర్చలు జరిపి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సీపీఐ పార్టీ నాయకులు, రైతులు ఆ బ్యాంకు మేనేజర్‌ను కలిసి
పంట రుణాల రెన్యువల్ పరంగా రైతులు పడుతున్న వివిధ రకాల ఇబ్బందులను మేనేజర్ కు వివరించడం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఫ్రీ హోల్డ్, రీ సర్వే, డీకేటి, తదితర భూముల రెన్యువల్ విషయంలో నిబంధనల పేరుతో రైతుల లోన్లు రెన్యువల్ చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
పై అధికారుల నుంచి అనుమతి లేదనే కారణంతో ఆ రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా కేవలం రెండు లక్షలు మాత్రమే రుణం ఇస్తామని నిబంధన పెడుతుండడమే కాక ఇంతకుముందు
ఆ భూములపై రెండు లక్షల పైన లోను తీసుకొని ఉంటే ఆ రుణాన్ని కూడా వెనక్కి చెల్లించాలని లేదంటే రుణం చేయలేమని రైతులను ఇబ్బంది పెట్టడం సబబు కాదని మేనేజర్ తో వాదించారు, ఇదిలా ఉండగా క్రాప్ లోన్ రెన్యువల్ చేయాలంటే సంబంధిత రైతు ఇతర బ్యాంకుల్లో ఎక్కడైనా గోల్డ్ లోను తీసుకుని ఉంటే తక్షణమే ఆ గోల్డ్ విడిపించి ఆ రుణాన్ని కూడా వెనక్కి చెల్లించాలని కోరారు. అధిక ధరలు చెల్లించి బయట కొనుగోలు చేయకుండా బ్యాంకు వారే ఉచితంగా పంపిణీ చేస్తారు, రుణాల రెన్యువల్‌కు సంబంధించి చిన్న చిన్న విషయాలకు తరచూ రైతులను బ్యాంకు చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారి పంట రుణాలను రెన్యువల్ చేయమని విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా ఏమైనా అన్ని రకాల భూములకు సంబంధించిన పంట రుణాలను రెన్యువల్ చేయడమే గాక స్కెల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తగినంత రుణాన్ని కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

