రూ.33 లక్షలతో మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు
రూ.14 లక్షలతో సిరాజ్ దక్కించుకున్న వరంగల్ వారియర్స్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సిఎ) ప్రతిష్టాత్మకంగా ‘తెలంగాణ టి20 లీగ్’ తొలి ఎడిషన్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగిన వేలంతో తొలి అడుగుపడింది. రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన ఈ వేలంపాటలో తొలుత ఐకాన్స్ వేలం జరిగింది. మెరుగైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటీ పడింది. చివరికి రూ.33 లక్షల అత్యధిక ధరకు తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ దక్కించుకుంది.
స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ను వరంగల్ వారియర్స్ రూ.14 లక్షలకు దక్కించుకోగా డిజిపి సివి ఆనంద్ తనయుడు, ఫాస్ట్ బౌలర్ సివి మిలింద్‌ను ఖమ్మం ఏసెస్ రూ.17 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి టోర్నీల్లో చెలరేగి ఆడుతున్న అమన్ రావును వరంగల్ వారియర్స్ రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ తనయ్ త్యాగరాజ్ రంగారెడ్డి రైజర్స్‌కు రూ.11 లక్షలకు అమ్ముడుపోయాడు. మిగిలిన వారిని రూ.10 లక్షలలోపే వివిధ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.
1,300 మంది వేలం..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్ కోసం 1,300 మంది వేలంలోకి వచ్చారు. మొత్తం 8 ఫ్రాంఛైజీలు ఉండగా.. ఒక్కో జట్టు కనీసం 20 మందిని కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. దీనితో ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.60 లక్షల మేర వెచ్చించాయి. ఇక 21 రోజుల పాటు సాగే ఈ పొట్టి లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఉంటాయి. అ నిశ్చయ ఉప్పల్ స్టేడియమే వేదిక.

