పారిస్: రష్యా టెన్నిస్ సంచలనం మిరా ఆండ్రీవా.. ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ టైటిల్ టైటిల్ ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఆండ్రీవా 6–3, 6–2తో మాయా చ్వాలిన్ స్కా (పోలెండ్)పై గెలిచింది. 19 ఏళ్ల ఆండ్రీవా కెరీర్లో ఇది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. గంటా 22 నిమిషాల మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్స్ సర్వీస్‌లు నిలుపుకునేందుకు చాలా శ్రమించారు.
చ్వాలిన్ 3-3తో సమం చేసింది. ఈ దశలో పుంజుకున్న ఆండ్రీవా ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా బ్రేక్ చేసి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభం నుంచే బలమైన సర్వీస్‌లతో చెలరేగిన ఆండ్రీవా క్రాస్ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయింది.
ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో చ్వాలిన్ స్కాను కట్టడి చేసింది. దాంతో ఆరంభంలోనే బ్రేక్ సాధించి సెట్ బిగించింది. ఇక్కడి నుంచి వరుస పాయింట్లతో ఏకపక్షంగా మ్యాచ్ ను ముగించింది. విన్నర్‌గా నిలిచిన ఆండ్రీవాకు దాదాపు రూ. 31 కోట్ల ప్రైజ్ మనీ లభించింది.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “ఫ్రెంచ్ క్వీన్ మిరా ఆండ్రీవా.. ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ టైటిల్‌ను రష్యా టెన్నిస్ సంచలనం సొంతం”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

