ఖతార్ మాజీ ఎమిర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్-థానీ (74) ఆదివారం (జూలై 12)మృతిచెందారు. ఆయనపట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం రోజు ఒక జాతీయ సంతాపం దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ జెండాను అవనత స్థితిలో ఎగురవేయనున్నారు. అధికారికంగా వినోద కార్యక్రమాలను కూడా నిర్వహించరాదని.
షేక్ హమద్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఖతార్‌ను అభివృద్ధి, శ్రేయస్సు దిశగా నడిపించిన దర్శనికుడు షేక్ హమద్ అని కొనియాడారు. ఆయన వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితుడని అని 2024లో ఖతార్ పర్యటన సందర్భంగా హమద్ తో జరిగిన భేటీని మోదీ గుర్తు చేసుకున్నారు.
ఆధునిక ఖతార్ రూపశిల్పిగా పేరొందిన షేక్ హమద్ 1995 నుండి 2013 వరకు ఖతార్ ఎమిర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన కుమారుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి అధికారాన్ని అప్పగించారు.
షేక్ హమద్ మృతి పట్ల గౌరవ సూచకంగానే జాతీయ సంతాపం ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే భారత్, -ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా గుర్తు చేసింది.

