ఖమ్మం జిల్లాలో రాపర్తిలో అత్యాచారానికి గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలికను మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఈ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. బాలిక పరిశీలించి బయటికి తెచ్చి.. చికిత్స కోసం బాలికను నిమ్స్ లో అడ్మిట్ చేసిన వ్యక్తిని పోలీసులు బెదిరిస్తున్నారని… ఈ ఘటనపై ప్రభుత్వం చేసిన తీరు చాలా అమానుషమని హరీష్ రావు. పిల్లలకు ప్రభుత్వమే మెరుగైన చికిత్స అందించాలని.. కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.
బాధిత బాలికకు ప్రభుత్వం చికిత్స అందించలేదా అని ప్రశ్నించారు. ప్రైవేట్ మందులు గా తెచుకొమ్మని రాసి ఇస్తున్నారని.. పేదరికంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం పట్టించుకోదా అని హరీష్ రావు ప్రశ్నించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని.. నిమ్స్‌లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినవారిని శిక్షించాలని హరీష్ రావు అన్నారు.
NCRB డేటా ప్రకారం రాష్ట్రంలో ఏటా క్రైమ్ పెరుగుతోందని…బాలికలపై అత్యాచారాలు ఏటా పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని అన్నారు హరీష్ రావు. అత్యాచారాలు దోపిడీలు జరిగితే నిందితులను పట్టుకోవడం లేదని అన్నారు.

