ఖుష్బూ | సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుటుంబంలో పెళ్లి సందడి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక వివాహం చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఖుష్బూ | సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కుటుంబంలో పెళ్లి సందడి. ఆమె పెద్ద కుమార్తె అవంతిక వివాహం చెన్నైకి చెందిన శ్రవణ్ శ్రీనివాసన్‌తో అంగరంగ వైభవంగా జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి-సురేఖ, నాగార్జున-అమల, వెంకటేష్-నీరజ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసి వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. వధూవరులను ఆశీర్వదించడంతో పాటు ఖుష్బూ కుటుంబంతో ఆప్యాయంగా గడిపారు.
బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్, జాకీ శ్రాఫ్ కూడా ఈ వివాహ వేడుకలో ఉంటారు. అలాగే ప్రముఖ నటి త్రిష కూడా పెళ్లిలో సందడి చేశారు. 80, 90 దశకాల్లో వెండితెరను ఏలిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వేడుక సినీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడిన ఈ ముగ్గురు స్టార్ హీరోలు నిజజీవితంలో మాత్రం ఎంతో సన్నిహిత మిత్రులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలో వారు తమ జీవిత భాగస్వాములతో కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖుష్బూతో ఈ ముగ్గురు హీరోలకు ప్రత్యేక అనుబంధం ఉంది. వెంకటేష్‌తో కలిసి ఆమె ‘కలియుగ పాండవులు’ చిత్రంలో నటించగా, అదే సినిమా ఇద్దరికీ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చింది. నాగార్జునతో ‘కెప్టెన్ నాగార్జున’ చిత్రంలో జంటగా నటించిన ఖుష్బూ, చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో ఆయన సోదరి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఒకే వేదికపై కనిపించిన సీనియర్ స్టార్ హీరోల సందడి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మెగాస్టార్ #చిరంజీవిరాజు #నాగార్జున మరియు విజయం #వెంకటేష్ యొక్క వివాహానికి హాజరయ్యారు #కుష్బూగోవాలోని ఓ రిసార్ట్‌లో కూతురు అవంతిక.#మెగాస్టార్ చిరంజీవి #అక్కినేని నాగార్జున #వెంకటేష్ దగ్గుబాటి #టాలీవుడ్ స్టార్స్ #శ్రేయస్ గ్రూప్ #శ్రేయస్ మీడియా pic.twitter.com/ii2DZvdh1S
— శ్రేయాస్ మీడియా (@shreyasgroup) జూన్ 25, 2026

