- చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఎక్కడ పెట్టాలి?
- వాస్తు శాస్త్రంలో కీలక విషయాలు..
వాస్తు చిట్కాలు: ఇంట్లో పెట్టే ఫోటోలు కేవలం ఫోటోలు మాత్రమే కాదు, అవి మన జ్ఞాపకాలు, మన సంబంధాలను గుర్తు చేస్తాయి. ముఖ్యంగా మరణించిన వారి ఇళ్లలో ఉంచడం మనం చూస్తాం. ”పితృ దేవతలు”గా పలికే మన ఇంటి పెద్దల ఫోటోలు ఎక్కడ ఉంచాలనే సందేహాలు తరుచుగా వస్తుంటాయి. హిందూ సంప్రదాయం, వాస్తు శాస్త్రాల ప్రకారం పితృదేవతల ఫోటోల స్థానం ఇంట్లో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.
వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం, మరణించిన కుటుంబ సభ్యుల ఫోటోలు ఇంటి దక్షిణ దిశ లేదా పడమర గోడపై ఉంచడం మంచిదని భావిస్తున్నారు. ఈ దిశలు పితృదేవతలతో అనుబంధం కలిగివుంటాయి అని సంప్రదాయ విశ్వాసం. ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖం వైపు తూర్పు కనిపించేలా ఉండటం మంచిది.
ఇదే సమయంలో పితృదేవతల ఫోటోలు దేవుళ్ల ఫోటోలతో కలిపి పూజ గదిలో ఉంచకూడదు. పూర్వీకుల్ని స్మరించుకుంటాం, గౌరవించుకుంటాం. దేవతల్ని పూజిస్తాం. అందుకే చనిపోయిన వారి ఫోటోలకు ప్రత్యేక కేటాయించాలి. వంట గదిలో ఫోటోలు పెట్టకూడదు. వంటగది ఆహారం, శక్తి, రోజూవారీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటుంది. ప్రశాంతంగా పెద్ద వారిని తలుచుకునే ప్రదేశం కాదు. మెట్ల వద్ద, హాలులో, ఎక్కువ మంది రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఉంచొద్దు. జీవించి ఉన్న వారి ఫోటోలు, మరణించిన వారి ఫోటోలతో కలిపి ఉంచొద్దు.
గరుడ పురాణం అనేది మరణాంతర జీవితం, పితృ కర్మలు, శ్రద్ధ కర్మల్ని గురించి తెలుపుతుంది. మరణించిన వారి ఫోటోలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించారు. చాలా మంది గరుడ పురాణాన్ని ప్రస్తావిస్తూ, చనిపోయిన వారి ఫోటోలు అక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు అని చెబుతారు. కానీ గరుడ పురాణంలో ఇలాంటివి ఏం చెప్పలేకపోయాయి.

