గల్ఫ్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కువైట్‌లోని అలీ అల్ సలేమ్, బహ్రెయిన్‌లోని ఇసా వైమానిక స్థావరాల్లోని అమెరికా సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. పర్షియన్ గల్ఫ్, ఖేష్మ్ ద్వీపంలో అమెరికా శత్రు చర్యలకు నిదర్శనమని టెహ్రాన్ ఆరోపించింది.
ఇరాన్ దాడులతో..
అమెరికా, బహ్రెయిన్ సైనికు MIM-104 పేట్రియాట్ వాయు రక్షణ వ్యవస్థల ద్వారా ఇంటర్సెప్టర్లను ప్రయోగించి ముప్పును తిప్పికొట్టాయి. కువైట్‌లో పేలుళ్ల శబ్దాలు వినపడగా, బహ్రెయిన్, ఇరాక్‌లోని ఎర్బిల్‌లో సైరన్లు మోగాయి. ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

